My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

అమెరికాలో ఇమ్మిగ్రేష‌న్ ర‌గ‌డ‌.. డెమోక్ర‌టిక్‌ నేతపై

అమెరికాలో ఇమ్మిగ్రేష‌న్ శాఖ  చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న డెమోక్ర‌టిక్ పార్టీ మ‌హిళా నేత ఇల్హ‌న్ ఒమ‌ర్‌పై దాడి చేశారు. మిన్న‌సొట్టాలో ఓ మీటింగ్‌లో మాట్లాడుతున్న స‌మ‌యంలో చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి ఒమ‌ర్‌పై ఓ వ్య‌క్తి ద్ర‌వాన్ని చ‌ల్లాడు. అయినా ఆ ప్ర‌తినిధి వెనుక‌డుగు వేయ‌కుండా త‌న స్వ‌రాన్ని వినిపించారు. సొమాలియాలో పుట్టిన అమెరికా ప్ర‌తినిధి అయిన ఇల్హ‌న్ చాన్నాళ్లుగా ట్రంప్ విధానాల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఇమ్మిగ్రేష‌న్ ఏజెంట్ల చేతుల్లో ఇప్ప‌టికే ఇద్ద‌రు మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో హోంల్యాండ్ సెక్యూర్టీ […]

అమెరికాలో ఇమ్మిగ్రేష‌న్ శాఖ  చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న డెమోక్ర‌టిక్ పార్టీ మ‌హిళా నేత ఇల్హ‌న్ ఒమ‌ర్‌పై దాడి చేశారు. మిన్న‌సొట్టాలో ఓ మీటింగ్‌లో మాట్లాడుతున్న స‌మ‌యంలో చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధి ఒమ‌ర్‌పై ఓ వ్య‌క్తి ద్ర‌వాన్ని చ‌ల్లాడు. అయినా ఆ ప్ర‌తినిధి వెనుక‌డుగు వేయ‌కుండా త‌న స్వ‌రాన్ని వినిపించారు. సొమాలియాలో పుట్టిన అమెరికా ప్ర‌తినిధి అయిన ఇల్హ‌న్ చాన్నాళ్లుగా ట్రంప్ విధానాల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఇమ్మిగ్రేష‌న్ ఏజెంట్ల చేతుల్లో ఇప్ప‌టికే ఇద్ద‌రు మ‌ర‌ణించారు. ఈ నేప‌థ్యంలో హోంల్యాండ్ సెక్యూర్టీ చీఫ్ రాజీనామా చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.అమెరికా ప్ర‌తినిధి ఇల్హ‌న్ ఒమ‌ర్‌పై దాడి చేసిన వ్య‌క్తిని 55 ఏళ్ల ఆంటోనీ క‌జిమిరేచాక్‌గా గుర్తించారు. ఒమ‌ర్‌పై ద్ర‌వాన్ని చ‌ల్లిన స‌మ‌యంలోనే అక్క‌డ ఉన్న పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ దాడిలో ఎటువంటి గాయాలు లేకుండా ఆమె బ‌య‌ట‌ప‌డ్డారు. నిందితుడిని ప‌ట్టుకున్న స‌మ‌యంలో ఆ మ‌హిళా నేత భ‌యప‌డ‌కుండానే అత‌ని వైపు దూసుకెళ్లారు. ఏ కార‌ణం చేత‌లో నిందితుడు దాడికి పాల్ప‌డ్డారో ఇంకా తెలియ‌దు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.