My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

అండర్ 19 వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్  ఘన విజయం

అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్‌పై  జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఘన విజయం నమోదు చేసింది. అరోన్ జార్జి సెంచరీతో చెలరేగగా, వైభవ్ సూర్యవంశీ దూకుడైన అర్ధసెంచరీతో భారీ విజయ లక్ష్యాన్ని ఇండియా సునాయాసంగా చేధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచులో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇద్దరు సెంచరీలు సాధించారు. ఫైజల్ […]

అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్‌పై  జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఘన విజయం నమోదు చేసింది. అరోన్ జార్జి సెంచరీతో చెలరేగగా, వైభవ్ సూర్యవంశీ దూకుడైన అర్ధసెంచరీతో భారీ విజయ లక్ష్యాన్ని ఇండియా సునాయాసంగా చేధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచులో మొదట ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇద్దరు సెంచరీలు సాధించారు. ఫైజల్ షినోజోదా 110 పరుగులు (93 బంతుల్లో 15 ఫోర్లు), ఉజైరుల్లా 101 పరుగులు, నాటౌట్ (86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు)తో ఆకట్టుకున్నారు. తర్వాత ఉస్మాన్ సాదత్ 39 పరుగులు, ఖలీద్ అహ్మద్జాయ్ 31 పరుగులు సాధించారు. ఇండియన్ బౌలర్లలో కనిష్క్ చౌహాన్, దీపేశ్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం 311 పరుగుల భారీ లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్ అరోన్ జార్జ్ 115 పరుగులు (104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లు)తో చెలరేగిపోయాడు. తర్వాత వైభవ్ సూర్యవంశీ 62 పరుగులు (33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు.

ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా 62 పరుగులు (59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు)తో అదరగొట్టాడు. అలాగే విహాన్ మల్హోత్రా కూడా 38 పరుగులతో రాణించారు. భారత బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో 41.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నెల 6, శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఈ తుదిపోరు ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.