ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా దాడులకు దిగిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలతోపాటు తుర్కియే, అజార్ బైజాన్ వంటి అనేక దేశాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. అయితే, ఇలా పొరుగు దేశాలపై దాడులు చేసినందుకు ఇరాన్ తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు.
పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఆ దేశాలపై దాడులు చేయకూడదని ఇరాన్ మధ్యంతర నాయకత్వం నిర్ణయించింది. ఇకపై పొరుగు దేశాలపై దాడులు చేయం. క్షిపణులు ప్రయోగించం. ఆ దేశాల నుంచి మా దేశంపైకి దాడులు జరగనంతవరకే మేం దాడులకు దిగకుండా ఉంటాం అని పెజెష్కియన్ తెలిపారు. ఒకవేళ అమెరికా సైన్యం కొలువుదీరి ఉన్న ఆయా దేశాల నుంచి ఇరాన్‌పై దాడి జరిగితే మాత్రం తిరిగి దాడి చేస్తామని ఇరాన్ వెల్లడించింది.


