పశ్చిమాసియా యుద్ధంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే మళ్లీ దాడులు జరగవని విశ్వసనీయమైన హామీలు ఇస్తేనే ఇది సాధ్యం అని పేర్కొన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఫోన్ సంభాషణలో మాట్లాడుతూ భవిష్యత్తు దాడుల నుంచి రక్షణ కల్పించే చర్యలు ఏ తీర్మానంలోనైనా తప్పనిసరిగా ఉండాలని పెజెష్కియన్ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో దురాక్రమణ పునరావృతం కాకుండా హామీలు ఇస్తే సంఘర్షణను ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా పెజెష్కియన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


