ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ ను టిమ్ కుక్ త్వరలోనే వీడే అవకాశం కనిపిస్తోంది. టిమ్ కుక్ ఈ నెలలో 65 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యాపిల్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తోంది. దీంతో టిమ్ కుక్ తర్వాత యాపిల్‌కు తదుపరి సీఈవో ఎవరు? అన్న చర్చ మొదలైంది. టిమ్ కుక్ వారసుడిగా ఎవరు రానున్నారు? అన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సీఈవో రేసులో సంస్థలో పనిచేస్తున్న జాన్ టర్నస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జాన్ ప్రస్తుతం యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టిమ్ కుక్ తర్వాత ఆ అత్యున్నత పదవిని చేపట్టబోయే వ్యక్తి జాన్ టర్నస్‌గా ప్రచారం జరుగుతోంది.


