My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International - NRI

జపాన్ కీలక నిర్ణయం..  ఇండియా కూడా చేస్తుందా?

ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి, ధరల్ని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వ్‌ను విడుదల చేస్తాయి. ఇప్పుడు జపాన్ అదే పని చేసింది. తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్లు జపాన్ ప్రధాని […]

ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి, ధరల్ని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వ్‌ను విడుదల చేస్తాయి. ఇప్పుడు జపాన్ అదే పని చేసింది. తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్లు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి వెల్లడించారు. ఈ నెల 16లోపు ఆయిల్ విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.

దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ జరుగుతుందని సికాయిచి అన్నారు. ఈ పనిచేసిన తొలి జీ7 దేశంగా జపాన్ నిలిచింది. చమురుకు సంబంధించి ఇలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు, చమురును ఎక్కువగా వినియోగించే దేశాలు తమ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్‌ నుంచి కొంత విడుదల చేయాలనేది ఒక ఒప్పందం. దీనివల్ల ఇతర దేశాలకు సరఫరా పెంచి, ధరల్ని తగ్గించి, అక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయొచ్చు. ఈ వ్యవహారాన్ని అంతా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) పర్యవేక్షిస్తుంది. ఇండియా కూడా గతంలో ఇలాగే ఆయిల్ రిజర్వ్స్‌ను విడుదల చేసింది. 2021లో అమెరికాతోపాటు ఇండియా ఆయిల్ విడుదల చేసింది. మన దగ్గర ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది. కానీ, ఇప్పుడు మాత్రం ఇండియా దీనికి దూరంగా ఉంటోంది. తాము ఐఈఏలో చేరడం లేదని ఇటీవలే ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.