బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కు ఘనంగా ముగింపు పలికారు. ముందునుంచి వినిపిస్తున్న అంచనాలు, సోషల్ మీడియాలో సాగిన ప్రచారం, ఓటింగ్ ట్రెండ్స్ అన్నీ నిజమయ్యాయి. కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు. ఈ విషయాన్ని గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. చివరి దశకు తనూజ, కళ్యాణ్ మాత్రమే మిగలగా, ఇద్దరికీ నాగార్జున రూ.20 లక్షల ఆఫర్ ఇచ్చారు. అయితే టైటిల్ కోసమే ఆడుతున్నామని ఇద్దరూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. అనంతరం స్టేజ్‌పైకి తీసుకొచ్చిన నాగార్జున విన్నర్‌ను ప్రకటించగా, కళ్యాణ్ పేరు వినిపించడంతో స్టూడియో మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది.దీంతో తనూజ రన్నరప్‌గా నిలిచారు.


