ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, సింగర్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఆయన బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ తో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. కాలభైరవ తమ్ముడు శ్రీసింహా హీరోగా నటించిన ఉస్తాద్ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కాలభైరవ మరియు కావ్యల మధ్య పరిచయం ఏర్పడిందని, అది క్రమంగా ప్రేమగా మారిందని సమాచారం. గత కొంతకాలంగా వీరిద్దరూ రహస్యంగా డేటింగ్‌లో ఉన్నట్లు, ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దలకు కూడా తెలుసని, వారు ఈ వివాహానికి అంగీకారం తెలిపారని సమాచారం.అయితే ఈ ప్రేమ, పెళ్లి వార్తలపై కాలభైరవ కానీ, కావ్య కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.


