కేరళలోని ధర్మదం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 9న కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో అక్కడి నామినేషన్‌ల పర్వం మొదలైంది. అందులో భాగంగానే విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. తలస్సెరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తన నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ప్రచారం మొదలుపెట్టిన విజయన్ తన రాజకీయ జీవితంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇది ఏడోసారి. ధర్మదం నుంచి బరిలో దిగడం ఇది మూడోసారి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున వీపీ అబ్దుల్ రషీద్ బరిలో నిలువగా.. బీజేపీ అభ్యర్థిగా రంజిత్ పోటీ చేయనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 9న 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది.


