హైదరాబాద్ చిత్రపురి వేదికగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వెండితెరపై మాయచేసేందుకు సిద్ధమవుతున్న సిద్ధుగాడి లవ్ స్టోరీ చిత్ర టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో అత్యంత వైభవంగా, సినీ ప్రముఖుల కోలాహలం మధ్య జరిగింది. మనోజ్ కుమార్ హీరోగా, మోహన సిద్ధి మరియు శృతి శంకర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సావిత్రమ్మ నిర్మించగా, రమేష్ చెరుకూరు ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించారు. వి. సాంబశివరావు, వేణు గోపాల చారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రచార చిత్రాల విడుదల వేడుకకు టాలీవుడ్ దిగ్గజ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నటుడు-నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్‌లో వచ్చిన సిద్ధు, సిద్ధార్థ్ రాయ్ అనే పేరు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిందని, అదే విధంగా ఈ సిద్ధుగాడి లవ్ స్టోరీ కూడా ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, కొత్తదనంతో కూడిన ఇలాంటి మంచి ప్రయత్నాలకు ప్రేక్షకులు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారని, ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని ప్రశంసించారు. దిగ్గజ దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ ఈ ట్రైలర్లో ప్రేమకథకు వినోదాన్ని, బలమైన భావోద్వేగాలను చక్కగా జోడించారని, సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. నటుడు, నిర్మాత అశోక్ కుమార్ సైతం సరికొత్తగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోవాలని చిత్ర బృందాన్ని దీవించారు.
……

































