రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పెద్ది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తగా, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో మూవీపై మ్యూజిక్ పరంగా కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లోనే మూవీ నుంచి మోస్ట్ అవేటెడ్ ట్రాక్ మస్సా మస్సా సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందనే నమ్మకంతో మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
………


