పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నేతలతో మాట్లాడారు. సౌదీ అరేబియాలోని గ్యాస్ కేంద్రాలపై దాడులతో ప్రపంచ దేశాలకు గ్యాస్ కొరత ఏర్పడనున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తం కావాలని మోడీ కోరారు. పశ్చిమాసియాలో తక్షణమే శాంతి స్థాపనకు చొరవ చూపాలని ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మన్యుయేల్ మక్రాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఒమన్ సుల్తాన్‌ను విజ్ఞప్తి చేశారు.
ఇజ్రాయేల్, అమెరికా దాడులకు ప్రతిచర్యగా సౌదీ అరేబియాలోని గ్యాస్ రిఫైనరీ కేంద్రాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఫలితంగా ముడి చమురు ధర లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి. యుద్ధం ఇలానే కొనసాగితే గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సిన ముప్పు తప్పేలా లేదు. దాంతో తక్షణమే పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత స్థాపనకు కృషి చేయాలని భారత ప్రధాని ప్రపంచ నేతలను కోరారు. ఇదే అంశంపై ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు, మలేషియా ప్రధాని, ఒమన్ సుల్తాన్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
నా ప్రియమైన స్నేహితుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్‌తో పశ్చిమాసియా యుద్ధం గురించి మాట్లాడాను. తక్షణమే యుద్ధ తీవ్రతను తగ్గించాల్సిన అవసరముందని, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలనే విషయంమై ఆయనతో చెప్పాను. ఆ ప్రాంతంలో శాంతి స్థాపనకు, సుస్థిరత నెలకొనేందుకు అవసమరమైన సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వివరించారు.


