మలేసియా లో త్వరలో కొత్త కాన్యులేట్ ఏర్పాటు చేయనున్నట్టు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రెండ్రోజుల మలేసియా పర్యటన నిమత్తం కౌలాలంపూర్ చేరుకున్న ఆయనకు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సాదర స్వాగతం పలికారు. భారతీయ సంప్రదాయ నృత్యాలతో ప్రవాస భారతీయులు ఆహ్వానం పలికారు. అనంతరం కౌలాలంపూర్ లోని భారత సంతతి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. భారత్ పదేళ్లలో వేగంగా సాధిస్తున్న ప్రగతిని ఈ సందర్భంగా మోదీ వివరిస్తూ, పదేళ్ల క్రితం 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రస్తుతం మూడో స్థానానికి చేరిందన్నారు. ఇండియాలో చదువుకునే విద్యార్థులకు త్వరలోనే తిరువళ్లువర్ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పారు. యూకే, యూఏఈ, అస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఈయూ, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని, విశ్వాసం భారతదేశపు బలమైన కరెన్సీగా మారిందని పేర్కొన్నారు.


