హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె కావ్య రెడ్డితో ఆయన వివాహం నిశ్చయమైంది. రీసెంట్‌గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు సంబంధించిన లగ్నపత్రిక వేడుక ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య జరిగిన ఈ కార్యక్రమం చాలా సాదాసీదాగా, కానీ ఆనందోత్సాహాల మధ్య పూర్తయ్యింది. ఈ లగ్నపత్రిక వేడుకలోనే పెళ్లి ముహూర్తాన్ని ఏప్రిల్ 29గా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.


