My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకున్న నాగచైతన్య వృషకర్మ…త్వరలోనే రిలీజ్!

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా మైథికల్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ. కార్తీక్ దండు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌స్తుతం శరవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీల‌క షెడ్యూల్‌ని రాజస్థాన్‌లో పూర్తిచేసుకున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ […]

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా మైథికల్ థ్రిల్లర్ చిత్రం వృషకర్మ. కార్తీక్ దండు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌స్తుతం శరవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీల‌క షెడ్యూల్‌ని రాజస్థాన్‌లో పూర్తిచేసుకున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్ష్ శ్రీవాస్తవ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

మ‌రోవైపు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారతీయ ప్రేక్షకులు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, ఒక అద్భుతమైన మైథికల్ థ్రిల్లర్ అనుభూతిని అందించేందుకు భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరియు శ్రీ నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.