ఖతర్‌లోని తెలంగాణ ప్రముఖురాలు నందిని అబ్బగౌనికి నారీ శక్తి సమ్మాన్ అవార్డు దక్కింది. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఖతర్‌లోని భారతీయ ఎంబసీ.. మహిళల శక్తిసామర్థ్యాలు, ప్రతిభ, సేవలకు గుర్తింపుగా నారీ శక్తి సమ్మాన్ అవార్డుకు పలువురు మహిళలను ఎంపిక చేసింది. వీరిలో నందిని కూడా ఒకరు. ఖతర్-భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారతీయ సాంస్కృతిక వైభవానికి చేసిన కృషిని గుర్తిస్తూ నందినిని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని భారతీయ ఎంబసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దోహా నగరంలో భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలోని ఐ.సి.సిలో జరిగిన పురస్కార కార్యక్రమంలో నందినికి ఖతర్‌లోని భారతీయ రాయబారి విపుల్ ఈ ఆవార్డును ప్రదానం చేసారు. తెలుగు ప్రవాసీ ప్రముఖలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాసీ ప్రముఖులు, భారతీయ దౌత్య, ఇతర అధికారవర్గాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.


