కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదయినట్లు సమాచారం. 17 ఏళ్ల బాలికకు బండి సంజయ్ కుమారుడు బలవంతంగా మద్యం తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం. దీంతో బాలిక రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. చివరకు నిన్న అర్ధరాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. అయితే బండి సంజయ్ కుమారుడిపై కేసు నమోదు చేసేందుకు ముందుగా పోలీసులు నిరాకరించారు. దీంతో దాదాపు ఆరు గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. చివరకు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని.. బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 31న తనతో బలవంతంగా మద్యం తాగించి, అసభ్యంగా ప్రవర్తించారంటూ బండి భగీరద్ పై మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. శుక్రవారం (మే 8వ తేదీ) రాత్రి బాలిక ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హైదరాబాద్ లోని బషీరా బాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.


