అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోం (126), కేరళం (140), పుదుచ్చేరి (30) లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ ఎన్నికల పోలింగ్ వేళ, ఏర్పాట్లను ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఆయా రాష్ట్రాలోని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.


