కేరళలోని కోజికోడ్‌లో జరుగుతున్న సాహిత్య ఉత్సవం ఒక అపురూప ఘట్టానికి వేదికైంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను దిగ్గజ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ప్రస్తుతం కేరళలో లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుండగా, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చింది సునీత విలియమ్స్. ఈ సమావేశంలో సునీత మాట్లాడుతూ అంతరిక్ష అనుభవాలు గురించి తెలిపారు. అంతేకాక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. అంతరిక్ష కేంద్రంలో నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. అక్కడ ప్రతి రోజూ కొత్తగా ఉంటుందని తెలిపారు. కల్పనా చావ్లాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.


