రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో విహరించారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమె సోర్టీ నిర్వహించారు. భారత్, పాకిస్థాన్ బోర్డర్లో ఉన్న జైసల్మేర్ జిల్లాలో ముర్ము విహరించారు. జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. టేకాఫ్‌కు ముందు ఆ హెలికాప్టర్ గురించి రాష్ట్రపతి ముర్ముకు కెప్టెన్ బ్రీఫింగ్ ఇచ్చారు. కాక్‌పిట్ నుంచి ఆమె చేతులు ఊపారు. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము విహరించారు. స్వయం సమృద్ధికి శక్తివంతమైన సంకేతంగా ప్రచండ హెలికాప్టర్ నిలుస్తుందని, జైసల్మేర్ జిల్లాలో విహరిస్తున్నానని, మన విరోచిత సైనికులకు హృదయపూర్వక గ్రీటింగ్స్ చెబుతున్నానని ముర్ము ఆ హెలికాప్టర్ కాక్‌పిట్ నుంచి సందేశం వినిపించారు. సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని, జై హింద్, జై భారత్ అని ఆమె అన్నారు.


