పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బిజెపి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి వచ్చిన ప్రధాని ప్రజలవైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో సభా ప్రాంగణం జయజయధ్వానాలతో మార్మోగిపోయింది. అంతేకాక, బిజెపి సీనియర్ కార్యకర్త అయిన మఖ్ఖన్లాల్ సర్కార్(98)కి పాదాభివందనం చేసిన, ఆ తర్వాత ఆప్యాయంగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. ఈ రెండు సన్నివేశాలు సభలో ఆకర్షణీయంగా నిలిచాయి.


