ప్రముఖ కథానాయిక రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం జనతాబార్. రోచి మూవీస్ పతాకంపై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో, అశ్వర్థ నారాయణ సమర్పణలో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై, ఆ క్రీడా విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు (సెక్సువల్ హరాస్‌మెంట్) చరమగీతం పాడటానికి పోరాడిన ఒక మహిళ కథే ఈ సినిమా. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ పాత్ర ఎంతో శక్తిమంతంగా ఉంటుంది. పూర్తి కమర్షియల్ అంశాలతో పాటు, సమాజానికి మంచి సందేశంతో పాటు మహిళల్లో చైతన్యం నింపే సినిమా ఇది. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ ఈ చిత్రంలో ఎంతో శక్తివంతమైన పాత్రను పోషించారు. తప్పకుండా ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల చేయనున్నారు.


