మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ దంపతులకు జూన్ 20, 2023న ఓ చిన్నారి జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకు క్లీం కారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే క్లీం కారా పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని ప్రపంచానికి చూపించలేదు. రీసెంట్గా రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి క్లీం కారా వాయిస్‌తో అభినందనలు తెలిపింది. అయితే క్లీం కారా ఈ రోజు తన మూడో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు క్లీం కారా ఫోటోను సోషల్‌మీడియా ద్వారా ఉపాసన షేర్ చేశారు. అటు రామ్ చరణ్, ఇటు ఉపాసన క్లీం కారాను ఇరువైపులా ఎత్తుకుని నిలబడగా, చిరు నవ్వులు చిందిస్తూ చిన్నారి కనిపించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. అబ్బాయికి శివరామ్, అమ్మాయికి అన్వీరా దేవి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

































