My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

రవిబాబు రేజర్ ట్రైలర్ విడుదల

టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ రూపొందించిన చిత్రం రేజర్‌. ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. క్రైమ్ మరియు యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూస్తుంటే, ఈ చిత్ర కథాంశం ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఓ వ్యక్తి శక్తివంతమైన రాజకీయ మరియు నేర వ్యవస్థతో చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. తాజాగా […]

టాలీవుడ్ విలక్షణ నటుడు, దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ రూపొందించిన చిత్రం రేజర్‌. ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. క్రైమ్ మరియు యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూస్తుంటే, ఈ చిత్ర కథాంశం ఒక చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ఓ వ్యక్తి శక్తివంతమైన రాజకీయ మరియు నేర వ్యవస్థతో చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో రవిబాబు అత్యంత భయంకరంగా, రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. మ‌రోవైపు ఈ చిత్రం విడుదల తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. మే 8వ తేదీ రవిబాబు తండ్రి, దివంగత ప్రముఖ నటుడు చలపతిరావు గారి జయంతి కావడంతో, ఆయన జ్ఞాపకార్థం అదే రోజున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. రవిబాబు దర్శకత్వం వహించడమే కాకుండా కథను కూడా ఆయనే అందించారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్. రాజేష్ సంగీతం అందించగా, చరణ్ మాధవనేని ఛాయాగ్రాహకుడిగా, సతీష్ పొలోజు యాక్షన్ కొరియోగ్రఫర్‌గా వ్యవహరించారు. వేసవి కానుకగా విడుదలవుతున్న ఈ ‘రేజర్’ బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.