రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అయ్యప్ప స్వామి మాలధారణలో రవితేజ అయ్యప్ప మాలధారణలో ఇరుముడికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ సినిమాలో ఎమోషనల్‌గా, డీప్‌గా చూపించబోతున్నారని సమాచారం. సెన్సిటివ్, క్లాస్ కథనాలతో పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈసారి డివోషనల్ టచ్‌తో కథను తెరకెక్కిస్తుండటం తో అంచనాలు మరింత పెరిగాయి. మాస్కు భిన్నంగా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా రవితేజ కొత్త ఇమేజ్ను ఆవిష్కరించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక అయ్యప్ప మాలధారణ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, 2026 ఎండింగ్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇరుముడి రవితేజ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా? అనే ఆసక్తి ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ పెరుగుతోంది.


