ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గా నిర్వహించిన, 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. హైకోర్టుకు సమీపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా, పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుండి గవర్నర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.


