ఉక్రెయిన్‌పై గెలిచి, ఆ దేశాన్ని ఆక్రమించే సామర్థ్యం రష్యాకు లేదని అమెరికా జాతీయ గూఢచార విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ తెలిపారు. రష్యాకు యూరప్‌పై దాడి చేయగల శక్తి ఉందన్న వాదనలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. యుద్ధఅనుకూల విధానాలకు మద్దతు కూడగట్టేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరప్ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే ఈ ప్రచారం జరుగుతోందని తులసి గబ్బార్డ్ ఆరోపించారు. యూరప్‌ను రష్యా ఆక్రమించాలని అనుకుంటోందన్న యూరోపియన్ యూనియన్, నాటో వాదనలకు అమెరికా గూఢచార వర్గాలు మద్దతు ఇస్తున్నాయనే ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. అవన్నీ పచ్చి అబద్ధాలను తేల్చి చెప్పారు.


