My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన ఏపీ సచివాలయంలో నూతన సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపడతారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన జి.సాయి ప్రసాద్ ఎంటెక్ పూర్తిచేశారు. […]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయి ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్‌ కె.విజయానంద్‌ పదవీ కాలం ఫిబ్రవరి 28, 2026 నాటితో ముగియనుంది. ఆయన స్థానంలో సాయి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం ఆయన ఏపీ సచివాలయంలో నూతన సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపడతారు.

1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన జి.సాయి ప్రసాద్ ఎంటెక్ పూర్తిచేశారు. 1991 ఐఏఎస్‌కు ఎంపికై 1992 నుంచి 1993 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 1993 నుంచి 1995 వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 1997 నుంచి 1998 వరకు కడప జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2000 నుంచి 2003 వరకూ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2010 నుంచి 2011 వరకు ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి‌గా కొనసాగుతున్న సాయి ప్రసాద్ రేపు (ఫిబ్రవరి 28) నూతన సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.