మత్తువదలరా ఫేం రితేశ్ రాణా దర్శకత్వంలో కమెడియన్ సత్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జెట్లీ. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ మంచి ఆసక్తిని కలిగించడంతో పాటు సినిమా రిలీజ్ కోసం ప్రజలు ఎదురు చూసేలా చేశాయి. ఈ క్రమంలో తాజాగా మూవీ నుంచి సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. సాయి సోమయాజులు ఈ పాటకు సాహిత్యం అందించగా కాల భైరవ సంగీతంలో శ్రావణ భార్గవి దీనిని ఆలపించారు. మూవీలో హీరో గుణగణాలను వర్ణించుకుంటూ సాగిన ఈ పాట ఆసాంతం హుషారుగా సాగింది. హీరోయిన్ రియా సింగ్ తన అందంతో మైమరిపించగా సత్య మాత్రం స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టాడు.
ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతలు చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దామల్లు భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ , ఈ తాజా సాంగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా జెట్లీ ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ హింట్ ఇస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.


