నటుడు శివకార్తికేయన్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సెయోన్. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ మధురైలో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కొత్త పోస్టర్‌లో శివకార్తికేయన్ ఎంతో ఇంటెన్స్ అండ్ రగ్గడ్ లుక్‌లో, కోపంతో రగిలిపోతూ కనిపిస్తున్న విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మాస్, రూరల్ యాక్షన్ డ్రామా, మరియు ఆధ్యాత్మిక అంశాల కలబోతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె నటిస్తున్న మొదటి స్ట్రెయిట్ తమిళ్ సినిమా ఇది కావడం విశేషం. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, బాల శరవణన్, అరుళ్ దాస్, రైచల్ రెబెక్కా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


