విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తొలి మహిళగా సునేత్ర పవార్ నిలిచారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అజిత్ దాదా అమర్ రహే అన్న ఎన్సీపీ నేతలు, కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంగణం మారుమోగింది.కాగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్సీపీ శాసనసభా పక్ష నాయకురాలిగా సునేత్ర పవార్ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉన్నది.


