టీ20 వలర్డ్‌కప్‌లో రెండో విక్టరీ నమోదు చేసింది శ్రీలంక. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 రన్స్ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. గ్రూప్ బీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో తొలుత శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 రన్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 120 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఒమన్ బ్యాటర్లలో నదీమ్ 53, వాసిమ్ అలీ 27 రన్స్ చేశారు. లంక బౌలర్లలో దుశమంత చమీరా, మహేశ్ తీక్షణ చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు.
శ్రీలంక బ్యాటర్లలో శనక, పవన్ రత్ననాయకే, కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. దీంతో శ్రీలంక భారీ స్కోరు చేసింది. మెండిస్ 45 బంతుల్లో 61 రన్స్, శనక 20 బంతుల్లో 50, రత్ననాయకే 28 బంతుల్లో 60 రన్స్ చేశారు.


