కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయానికి భారత జట్టు సందర్శించింది. ఈ సందర్భంగా జగన్నాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది. ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సైతం ఉన్నాడు. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, భార్య దేవిషా శెట్టితో కలిసి ఆలయానికి చేరుకున్నాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మాన్ గిల్ సహా పలువురు ప్లేయర్స్ ఉన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్లేయర్లు ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సేవాయత్‌ల సింహద్వారల వద్ద దీపాలువ వెలిగించి, దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్‌లో భారత జట్టు విజయం సాధించాలని పూజలు చేశారు. ఈ చాలా రోజుల తర్వాత ఒడిశాలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండడం ఉత్సాహంగా ఉందని, భారత ప్లేయర్లు అత్యుత్తమంగా రాణించి భారత్‌కు విజయం సాధించి పెట్టాలని ప్రార్థిస్తున్నట్లు ఓ పూజారి తెలిపారు.


