స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సు సందర్భంగా అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎమ్ఆర్ఓ కేంద్రాన్ని వరంగల్ లేదా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో రాష్ట్రం, విమానయాన, ఏరోస్పేస్ రంగాల్లో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది.


