గల్ఫ్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఒమాన్ రాజధాని మస్కట్‌లోని శ్రీ కృష్ణ మందిర ప్రాంగణంలో ఒమాన్ తెలంగాణ సమితి (ఒ.టి.యస్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం తెల్లవారుజామున సుప్రభాతంతో మొదలై సాయంత్రం మహాప్రసాదంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో భారతీయ రాయబారి జి.వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒమాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాలన్నీ కూడా సురక్షితంగా, సుభిక్షంగా ఉండాలని శివపార్వతులను ప్రార్థించామని ముఖ్య నిర్వాహకులలో ఒకరైన నూనె లక్ష్మణ్ పేర్కొన్నారు.


