దేశంలో అత్యంత కీలకమైన 2027 జనాభా లెక్కల ప్ర క్రియ తొలి దశ ఖరారు అయింది. ఇందులో భాగంగా ముందుగా ఇళ్ల లెక్కలు, ఇళ్ల జాబితాల సేకరణ ప్రక్రియ (హౌస్ లిస్టింగ్ ) జ రుగుతుంది. దీనిని ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ చేపడుతారని ప్రభుత్వం అదికారిక ప్రకటనలో తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ని ర్ణీత గడువు మధ్యలో ఖరారయిన వేర్వేరు తేదీలలో వరుసగా నెలరోజుల పాటు ఇంటింటి గణన జరుగుతుంది. నోటిఫికేషన్‌ను రి జిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ వెలువరించారు.. 130 కోట్ల జనాభా దాటిన దేశంలో ఈ జనాభా లెక్కల ప్రక్రియ అత్యంత బారీ విస్తృత బృహత్తర కార్యక్రమం కానుంది. పైగా కులాల వారి జన సంఖ్య కూడా వచ్చే వచ్చే ఏడాది చివరికి వెలువడనుంది. సెన్సస్ 2027 లో భాగంగా ఇంటింటికీ జనాభా సేకరణ కర్తలు వెళ్లి లెక్కలు సేకరిస్తారు. 15 రోజుల ముందుగానే పౌరులు తమ వివరాలను తెలియచేసుకునేందుకు స్వీయ ప్రకటన అవకాశం కల్పిస్తారని హోం మంత్రిత్వ శాఖ వెలువరించిన నోటిఫికేషన్‌లో తెలిపారు.


