పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ప్రేక్షకుల్లో భారీ స్పందనను రాబట్టింది. పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో అలరిస్తున్నాయి. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్, మంచి వసూళ్లతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఈ సినిమాను చూసారు. అలాగే పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక ప్రదర్శనలో హీరోయిన్ శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడి, అలాగే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి కూడా హాజరయ్యారు. ముఖ్యంగా మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే చోట కలిసి సినిమా చూడడం అభిమానులకు కన్నుల పండుగగా మారింది.


