మెగా పవర్‌స్టార్ రామచరణ్ నటించిన పెద్ది సినిమా విడుదల ముందు ఎగ్జిబిటర్లు డిమాండ్ చేసిన పర్సంటేజీల వివాదం సద్దుమణిగింది. అగ్ర కథానాయకుడు చిరంజీవి జోక్యంతో పర్సటేజీల వివాదం వాయిదా పడింది. బుధవారం చిరంజీవితో ఎగ్జిబిటర్లు మరోసారి సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం పెద్ది చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. జూన్ 30 తర్వాత విడుదల అయ్యే చిత్రాలకు పర్సంటేజీ విధానం వర్తింపజేస్తామని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ నివేదిక మేరకు నడుచుకోవాలని సూచించారు.


