తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీ, కైట్ ఫెస్టివల్, వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, చిత్రలేఖనం, క్రికెట్ పోటీలు వంటివి నిర్వహించారు. ఈ వేడుకల్లో నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రవాసులను అలరించాయి. స్థానిక ఎన్నారై సంఘాల ఆధ్వర్యం లో గల్ఫ్, అమెరికా, ఐరోపాల్లో భారత సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. జపాన్‌తో పాటు పలు దేశాల్లో ఎన్నారైలు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.


