హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్. విధి యాదవ్ హీరోయిన్. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇన్నిరోజులు లవర్ బాయ్ గా అలరించిన నాగశౌర్య, ఈసారి పూర్తి యాక్షన్ మూవీతో రాబోతున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో సముద్రఖని, నరేష్ వికె, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


