My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

శ్రీ చిదంబరం గారు ట్రైలర్ రిలీజ్ చేసిన  దర్శకుడు బుచ్చిబాబు సాన

హీరో వంశీ తుమ్మల నటిస్తున్న చిత్రం శ్రీ చిదంబరం గారు. సంధ్యా వశిష్ట కథానాయిక. దర్శకుడు వినయ్ రత్నం. తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.మెల్లకన్ను కారణంగా తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కళ్ళద్దాలు ధరించే కథానాయకుడు, ఒక అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత తన బలహీనతను ఎలా అధిగమించాడనేది ఈ సినిమా ప్రధానాంశం. వంశీ తుమ్మల ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన మేనరిజమ్స్‌తో కష్టపడగా, సంధ్యా […]

హీరో వంశీ తుమ్మల నటిస్తున్న చిత్రం శ్రీ చిదంబరం గారు. సంధ్యా వశిష్ట కథానాయిక. దర్శకుడు వినయ్ రత్నం. తాజాగా ఈ చిత్రం ట్రైల‌ర్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా లాంచ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.మెల్లకన్ను కారణంగా తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎప్పుడూ కళ్ళద్దాలు ధరించే కథానాయకుడు, ఒక అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత తన బలహీనతను ఎలా అధిగమించాడనేది ఈ సినిమా ప్రధానాంశం. వంశీ తుమ్మల ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన మేనరిజమ్స్‌తో కష్టపడగా, సంధ్యా వశిష్ట కథానాయికగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే నేటి యువతకు తమ లోపాన్నే బలంగా మార్చుకోవాలని చెప్పే ఒక నిజాయితీ గల స్ఫూర్తిదాయకమైన ప్రయత్నమని ప్రశంసించారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని చింతా వినీషా రెడ్డి మరియు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. చందు రవి సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గారు ఒక పాట పాడటం విశేషం. నీ లోపం నీకు బలహీనత కాకూడదు, అది నీ బలం అవ్వాలి అనే చక్కని సందేశంతో వస్తున్న ఈ గ్రామీణ ప్రేమకథ ఫిబ్రవరి 6 ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.