చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందన్న అమెరికా ప్రకటనపై రష్యా ఘాటుగా స్పందించింది. ఆ వార్తలను విశ్వసించేందుకు తగిన ఆధారం లేదని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ తన వైఖరి మార్చుకుందని విశ్వసించేందుకు ఎటువంటి ఆధారం లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. ఈ కొనుగోళ్లు రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని కొనసాగించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.


