My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International - NRI

ఈ ప్రచారంలో నిజం లేదు  .. స్పందించిన కేంద్రం

ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్‌ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారనడం నిజం కాదని వెల్లడించింది. ఈ నెల 24 నాడు మోదీతో ట్రంప్ […]

ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్‌ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారనడం నిజం కాదని వెల్లడించింది.

ఈ నెల 24 నాడు మోదీతో ట్రంప్ మాట్లాడారు. ఈ ఫోన్‌ కాల్‌లో మస్క్ కూడా చేరినట్లు ఈ ప్రచారం మొదలైంది. నిజానికి ఇలా జరగడం నిబంధనలకు విరుద్ధం. అంతర్జాతీయంగా ప్రముఖులైన ఇరు దేశాధినేతల మధ్య జరిగే ఫోన్ సంభాషణలు చాలా రహస్యంగా ఉంటాయి. ఇతరులు ఎవరికీ ఆ ఫోన్ కాల్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. అవసరాన్ని బట్టి సంబంధిత అధికారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాని, ప్రైవేటు వ్యక్తులు ఈ ఫోన్ కాల్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. పైగా యుద్ధం సమయంలో ఇరు దేశాధినేతల మధ్య మరొకరికి చోటుండదు. ఈ నేపథ్యంలో మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నారనే ప్రచారం వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ అంశంపై కేంద్రం స్పందించింది. ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. ఈ ఫోన్‌ కాల్‌లో మోదీ, ట్రంప్ మాత్రమే పాల్గొన్నారని, ఇరువురు మాత్రమే చర్చించారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.