మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం అత్యంత దారుణమని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బిల్లును వ్యతిరేకించిన వారికి చీకటి రోజులు దగ్గర పడ్డట్టేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్ ప్రక్రియలో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో మెజారిటీకి అవసరమైన 352 మంది సభ్యుల బలం లేకపోవడంతో బిల్లు వీగిపోయింది.
దీంతో డీలిమిటేషన్ బిల్లు-2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు-2026ను వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవటంపై డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని మోదీ సభా వేదికగా వివరించారు. మహిళా రిజర్వేషన్ల పట్ల ఇండియా కూటమికి చెందిన వారికి చిత్తశుద్ధి లేదు. గ్రామాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని ప్రజలకు వివరిస్తాం. రాజకీయ లబ్ధి కోసమే మహిళలను వాడుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.


