అజయ్ దిషన్, ధనుషా జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ బూకీ. సునీల్, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. గణేశ్‌చంద్ర దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. ఈ నెల 20న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ సాంకేతికంగా అన్ని విధాలా సినిమా సమర్ధనీయంగా ఉంటుంది. నా మార్గాన్‌లో మంచి పాత్ర పోషించిన అజయ్ ఇందులో హీరో. ఈ సినిమాలోని తన నటనను అంతా మెచ్చుకుంటారు. ధనుషా తెరపై చాలా క్యూట్‌గా ఉంది.ఈ సినిమా క్లైమాక్స్‌లో అందరికీ కచ్చితంగా కన్నీళ్లొస్తాయి. అందరికీ నచ్చే సినిమా ఇది అని అన్నారు.
ఈ సినిమాలో భాగం కావడం పట్ల మంచు లక్ష్మి ఆనందం వెలిబుచ్చారు. తమిళంలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని, ఈ సినిమాలో చాలా పెద్ద సర్‌ప్రైజ్ ఉందని, అది చూశాక తెలుస్తుందని దర్శకుడు గణేశ్‌చంద్ర తెలిపారు.


