అమెరికా- ఇరాన్ మధ్య ఉన్న వివాదం ఎటూ తేలడం లేదు. తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాల్సిందే అని ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అయితే, ఈ అంశంపై ఇరాన్ కొన్ని షరతులు విధించింది. ఒకవైపు ఒప్పందంపై చర్చలు అంటూనే, రెండు దేశాలూ యుద్ధ సన్నాహాలు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. 10-15 రోజుల్లో ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకుని తీరాలని అల్టిమేటమ్ ఇచ్చాడు. ఒకవేళ ఈలోగా ఒక ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఇరాన్‌తో అణు ఒప్పందం అంత సులభం కాదని కొన్నేళ్లుగా అర్థమైంది. అయితే, మేం తప్పకుండా అణు ఒప్పందం చేసుకుని తీరాలి. లేకుంటే ఇరాన్ విషయంలో ఎలాంటి పరిణామాలైన జరగవచ్చు. పది రోజుల్లో సరైన ఫలితం కనిపించాలి అని ట్రంప్ వ్యాఖ్యానించాడు.


