పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు ఇప్పటికే భారీ రెస్పాన్స్ వస్తుండగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


