విజయ్ ఆంటోని హీరోగా, డైరెక్టర్ శశి డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం వంద దేవుళ్లు. ఈ మూవీని జూన్ 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.ఈవెంట్లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ శశి 20 ఏళ్ల నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం నాకు బిచ్చగాడు సినిమాతో హీరోగా కొత్త లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ వంద దేవుళ్లు సినిమాతో రాబోతున్నామన్నారు. శశి ఈ సినిమా కథ చెప్పిన తర్వాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్గా, కొత్తగా ఉంటుంది. జూన్ 19న వస్తోన్న వంద దేవుళ్లు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నానన్నాడు.

































