Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

నాగబంధం నుంచి వీరనాగ సాంగ్ రిలీజ్

నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్ చిత్రాన్ని దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించారు. ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రే కర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ […]

నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్ చిత్రాన్ని దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించారు. ఈ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో విరాట్ కర్ణ హీరోగా నటించారు. నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రే కర్, మురళీ శర్మ, దక్ష నాగార్కర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మేకర్స్ వీరనాగ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట నాగ సాధువుల ఆధ్యాత్మిక తాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరించిం ది. శ్రీహర్ష ఈమని సాహిత్యం ఆధ్యాత్మిక భావాన్ని బలంగా ప్రతిబింబిం చగా, దీపక్ బ్లూ తన పవర్ ఫుల్ వోకల్స్ తో పాటకు ప్రాణం పోశారు. జునైద్ కుమార్ – అభే అందించిన సంగీతం ప్రతి ఫ్రేమ్‌లో భక్తి భావాన్ని మరింత ఎలివేట్ చేసింది. కైలాస పర్వతాన్ని తలపించే అద్భుతమైన నేపథ్యంతో తెరకెక్కించిన ఈ పాటలో నాగ సాధు తాండవం విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. నాగ సాధుగా విరాట్ కర్ణ తాండవం కట్టిపడేసింది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కానుంది అని మేకర్స్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.