మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదల తేదీ విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి మెగా ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ను మరోసారి ఫాంటసీ ప్రపంచంలో చూడబోతున్నామని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తయినప్పటికీ విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆగస్టు రిలీజ్పై కూడా వార్తలు వినిపించాయి. కానీ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ వార్తలన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం విశ్వంభర ను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సీజన్కు భారీ చిత్రాలకు మంచి మార్కెట్ ఉండటంతో ఈ పండుగను లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.దీనికి ప్రధాన కారణం రాబోయే నెలల్లో టాలీవుడ్లో భారీ చిత్రాలు క్యూ కడుతుండడం. డిసెంబర్ నుంచి వరుస స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే 2027 సంక్రాంతి, సమ్మర్ సీజన్లు కూడా ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులతో బుక్ అయ్యాయి. దీంతో విశ్వంభర కు సరైన విడుదల తేదీ ఎంపిక చేయడం మేకర్స్కు సవాలుగా మారిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
…………….

































